ఘనంగా మహిళ దినోత్సవం

చీరాల(వార్తా ప్రపంచం): స్థానిక రెడ్డి గారి స్కూల్ నందు సావిత్రి బాయ్ పూలే 188 వ జయంతిని పురస్కరించుకుని గురువారం మహిళ దినోత్సవం
కార్యక్రమాన్ని స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె.వీరంజనేయులు ఆధ్వర్యంలో స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యు టి ఎఫ్ నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శలను గుర్తుచేసారు.సమాజంలో స్త్రీలకు విద్య చాలా అవసరం అని గుర్తించి తన భార్య అయిన సవిత్రిబాయ్ కు విద్య
నేర్పించారు.సవిత్రిబాయ్ పూలే
విద్య నేర్చుకొవ్వటమేకాకుండా
తన భర్తకు అన్నీ విషయాలలో
తోడుగా వుంటూ స్త్రీలు అన్ని రంగాలలో రాణించాలంటే వారికి జ్ఞానం అవసరం ఆ జ్ఞానం విద్య ద్వారా వస్తుంది అని గ్రహించి పాఠాశాల లను ఏర్పాటు చేసి అనేక మంది స్త్రీలకు విద్యను అందించిన తొలి మహిళ ఉపాధ్యాయులుగా గుర్తింపు తెచ్చుకుందన్నారు.అంతేకాకుండా మంచి సంఘసంస్కర్తగా,స్త్రీ విముక్తి కొరకు ఉద్యమం చేసి ఉద్యమ కర్తగా పేరు తెచ్చుకుదన్నారు.భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయులుగా నిమ్నజాతులైన యస్ సి,యస్ టి,బి సి మహిళలను చైతన్య వంతులుగా చేసిందని కొనియాడారు.

ఈ కార్యక్రమం తొలుత సావిత్రి బాయ్ పూలే
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శి జానీబాష,పట్టణ యు టి ఎఫ్ నాయకులు కుర్ర శ్రీనివాసరావు,పాఠశాల ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, భవాని,అనుష,రామిరెడ్డి,ప్రసన్న,అంజిరెడ్డి
మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply