అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే

చీరాల,వార్తాప్రపంచం :

అణ గారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని కామాక్షీ కేర్‌ ఆసుపత్రి ఎండి తాడివలసదేవరాజు అన్నారు. భారతదేశ తొలి సామాజిక ఉద్యమ నేత జ్యోతిరావుపూ 129వ వర్థంతి సభ బహుజన సమా పార్టీ(బీఎస్పీ) చీరాల నియోజకవర్గకమిటీ ఆధ్వర్యంలో చీరాల వాడరేవు రోడ్డు, 2వ మైలు, వాకావారిపాలెం పూలే విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. తొలుత చీరాల గడియారస్తంభం సెంటర్‌లో ఉన్న పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా బయల్దేరి సభా స్థలానికి చేరుకున్నారు. బీఎస్పీ జిల్లా కార్యదర్శి వై.జి.సురేష్‌కుమార్‌ అధ్యక్షత వహించగా, బీఎస్పీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు ప్రసంగించారు.

భారతదేశంలో స్త్రీలకు, అంటరాని కులాల వారికి మొట్టమొదటగా పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత పూలే దంపతులదేనని అన్నారు. అలాగే నాటి సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలకు ముఖ్యంగా వితంతు స్త్రీల, కార్మికుల సమస్యలపై పోరాడారని అన్నారు. పూలే రచించిన గ్రంథాలు, సాగించిన ఉద్యమాలను అధ్యయనం చేసిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ పూలేను తన గురువుగా ప్రకటించుకున్నారని అన్నారు. పూలే సాధించిన అనేక హక్కులన్నింటిని రాజ్యాంగంలో పొందుపరిచి చట్టబద్దత ఏర్పరిచారన్నారు. పూలే వర్థంతి సభకు పరిచయకర్తగా బిఎస్‌పీ చీరాల నియోజకవర్గ అధ్యక్షులు గొర్రిపాటి రవికుమార్‌ వ్యవహరించగా, బీఎస్పీ రాష్ట్ర నాయకులు దుడ్డు భాస్కరరావు, బీసీ ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు డాక్టర్‌ గుంటుపల్లి సుబ్బారావు, అధ్యక్షులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, బలహీన వర్గాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోసాల ఆశీర్వాదం, దళిత మహాసభ నాయకులు నూకతోటి బాబూరావు, సిపిఐ నాయకులు మేడా వెంకట్రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply