ఖమ్మం నగరంలో సైకిల్ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటన

ఖమ్మం,వార్తాప్రపంచం:

◆ కాన్వాయిని వదిలారు సైకిల్ ఎక్కారు

◆ స్వయంగా పరిశీలించిన అనేక సమస్యలు

◆ ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశం

◆ మంత్రి వెంట జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, సిబ్బంది..

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న ప్రధాన సమస్య పారిశుద్ధ్య.ప్రతి రోజు చెత్తను తొలగిస్తున్ననప్పటికీ మరుసటి రోజు టన్నుల కొద్దీ చెత్త ఉత్పత్తి అవుతుంది.చెత్తను సేకరించడం మున్సిపాలిటీకి ఎప్పటికి సవాలే.అయితే అందుకు అనుగుణంగా మున్సిపల్ కార్పోరేషన్ ప్రణాళికా బద్ధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం.తమ సమస్య కాదు అన్న చందంగా ప్రజలు వ్యవహరిస్తే సమస్యకు పరిష్కరం ఎప్పటికి అసంపూర్తి గానే మిగిలిపోతుంది.ఖమ్మంను తన సొంత ఇల్లులా భావించిన ఖమ్మం ఎమ్మెల్యే,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పట్టు వదలని విక్రమార్కుడిలా నగర్ సమస్యలపై అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి నగరాభివృద్ధికై అనేక రకాల కార్యక్రమాలు రూపొందించి,అమలు చేసిన దరిమిలా నేడు ఖమ్మంకు ఒక రూపం వచ్చింది. నాడు(2014 కి ముందు) మురికి కూపంలా ఉన్న ఖమ్మం నేడు రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచింది.ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని వారి వారి స్థానాల్లో అమలు చేస్తున్నారంటే ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. సంవత్సరాల కృషి, నిర్విరామ పోరాట ఫలితమే. పరిశుద్యంపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేరుగా డివిజన్లలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవటంతో పాటు సమస్య వద్దకే నేరుగా వెళ్లి వాటి పరిష్కరం కోసం ప్రత్యామ్నాయ సలహాలు సూచనలు చేయటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రానికి మంత్రిని అయినా ఖమ్మంకి బిడ్డనే అనే బాధ్యతతో కాన్వాయిని వదిలారు సైకిల్ ఎక్కారు.నగరమంతా చుట్టి వచ్చారు.మున్సిపల్ కార్యాలయం నుండి బయలుదేరి కాస్బా బజార్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, ప్రకాష్ నగర్, బోస్ బొమ్మ సెంటర్, మిర్చి మార్కెట్ రోడ్, పంపింగ్ వెల్ రోడ్, కిన్నెరసాని సర్కిల్, గాంధీ చౌక్, గోల్డ్ కాంప్లెక్స్, కమాన్ బజార్ గేటు మీదగా రవి చెట్టు బజార్,  స్టేషన్ రోడ్ మీదగా మున్సిపల్ కార్యాలయం వరకు సైకిల్ పై తిరిగి అనేక కూడల్లో పేరుకుపోయిన చెత్త, రోడ్ పనులు, మురుగు కాల్వలు, పబ్లిక్ టాయిలెట్స్ తదితర సమస్యలను గుర్తించి వాటికి ప్రత్యామ్నాయ సూచనలను చేశారు.


ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  మాట్లాడుతూ ఖమ్మం నగరంలో నెలకొన్న అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కరం చూపగలిగాం.కానీ పారిశుధ్యం నిరంతర ప్రక్రియ.కార్పొరేషన్ పరిధిలో 1, 2, 3,వ పట్టణంలో అన్నీ మౌలిక వసతులు ఏర్పాటు చేశాం.కూరగాయల మార్కెట్, సిసి రోడ్స్,త్రాగునీరు, విద్యుత్ దీపాలు లాంటివి. నగరంలో అన్ని ప్రధాన రోడ్లు విస్తరించి సెంట్రల్ లైటింగ్ మంజూరు అయినవి. కొన్ని పూర్తి కాగా మరికొన్ని  పనులు జరుగుతున్నాయి.రాష్ట్రంలోనే ఖమ్మంను ప్రత్యేక గుర్తింపు తీస్కురావలనేది నా ప్రయత్నం.రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇదే విధంగా తిరిగి అక్కడ సమస్యలు కూడా తెలుసుకుని పరిష్కరిస్తా..

Leave a Reply