నాన్నా బయటకు తీసుకెళ్లు… అమ్మను చంపి తప్పు చేశాను: కీర్తి రోదన

తల్లిని దారుణాతి దారుణంగా హత్య చేసి వార్తల్లోకి ఎక్కిన హైదరాబాదు శివారు హయత్ నగర్ యువతి కీర్తి, ప్రస్తుతం పశ్చాత్తాప పడుతోంది. ప్రియుడి కోసం కన్నతల్లిని చంపేసిన కీర్తి, ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉందన్న సంగతి తెలిసిందే.

ఆమెను తండ్రి, చిన్నమ్మ, అమ్మమ్మ కలిసిన వేళ, బోరున విలపించినట్టు సమాచారం.

సాయికుమార్ బ్లాక్ మెయిల్ చేసి, బెదిరింపులకు దిగడంతోనే తాను అమ్మను హత్య చేసేందుకు సహకరించానని చెప్పిన ఆమె, తనను బయటకు తీసుకువెళ్లాలని ప్రాధేయపడింది. బయటకు తీసుకెళితే, చెప్పిన మాట వింటానని భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది. బుద్ధిగా చదువుకుంటానని తండ్రి వద్ద వాపోయింది. కాగా, గురువారంతో కీర్తి రిమాండ్ గడువు ముగియడంతో, ఆమెను కోర్టుకు తీసుకెళ్లగా, మరో 14 రోజుల పాటు రిమాండ్ ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply