విద్యార్థుల ఖాతాలకే రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము

జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ, దివ్యాంగులకు అందిస్తున్న పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ, ఆపైస్థాయి ఉన్నత విద్యకూ వర్తింపచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్‌ఆర్‌ నవశకం పేరిట విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ కార్డులు జారీ చేయనున్నారు. రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పథకం అమలుకు కలెక్టర్లు బాధ్యత వహిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు చెల్లించనున్నారు. అర్హులైన విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలకు రెండు విడతలుగా చెల్లించనున్నారు. ఈ రెండు పథకాలు వర్తించాలంటే కనీసం 75 శాతం మేర హాజరు తప్పనిసరి. అంతేకాకుండా ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీల్లో సీట్లు పొందినవారికి, కరస్పాండెంట్‌, దూరవిద్య, మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు పొందిన వారికి కూడా వర్తించవు

Leave a Reply