ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్‌ సమావేశం ప్రారంభం

ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ ఆత్మీయ సమావేశం ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్రంలోని 97 డిపోలకు చెందిన కార్మికులు హాజరయ్యారు. ఒక్కో డిపో నుంచి ఇద్దరేసి మహిళలు సహా ఐదుగురు వచ్చారు. సమావేశం ప్రారంభానికి ముందు కార్మికులతో కలిసి సీఎం భోజనం చేశారు. అనంతరం సమావేశమై ఆర్టీసీ స్థితిగతులతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై కార్మికులకు కేసీఆర్‌ వివరిస్తున్నారు.

Leave a Reply