ప్రియాంకను అత్యంత కిరాతం​గా హత్యచేసిన హంతకులను కఠినంగా శిక్షించాలి

ప్రియాంకను అత్యంత కిరాతం​గా హత్యచేసిన హంతకులను కఠినంగా శిక్షించాలి:

*రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల ఇన్చార్జి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ డిమాండ్*

హైదరాబాద్:పరిస్థితులు రోజురోజుకి దారుణంగా తయారవుతున్నాయని,ప్రియాంక రెడ్డి హత్య తెలియగానే ఆ సమయంలో తనకు మాటలు రాలేదని ఆర్.పి.ఐ ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల ఇన్చార్జి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ తన ఆవేదన తెలియజేశారు. 

ఈ సందర్భంగా పేరం శివనాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ తాను అత్యంత సురక్షిత నగరమని భావించే హైదరాబాద్‌లో ఇంత దారుణ ఘటన బాధ కలిగించిందన్నారు. ఏ సమయంలోనైనా బయటికి వెళ్లిన మహిళలు సురక్షితంగా తిరిగివచ్చే పరిస్థితులు దేశంలో ఎప్పుడొస్తాయని ప్రశ్నించారు. ప్రియాంకను అత్యంత కిరాతం​గా హత్యచేసిన హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రియాంక మృతికి సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు..దేశంలో ఆడపిల్లలను కాపాడుకోలేకపోతే మనకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ప్రియాంక కేసులో న్యాయం జరుగుతున్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్య్రం అన్నాడు మహాత్ముడు.అర్ధరాత్రి కాదు.పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి నెలకొంది.మగరాయుళ్లలో పెరుగుతున్న నేరప్రవృత్తి కొంత కారణమైతే.. అందుబాటులో ఉన్నచట్టాలను అమ్మాయిలు ఉపయోగించుకోకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు.ఇవి ఎన్నెన్నో దారుణాలకు దారి తీస్తున్నాయి.గురువారం వెలుగు చూసిన ప్రియాంక హత్యోదంతం తాజా ఉదాహరణ అని,ఆపద సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని పేరం నాగేశ్వరరావు గౌడ్ సూచించారు. లైవ్‌ లొకేషన్‌ యాప్స్‌, అత్యవసర ఫోన్‌ కాల్‌ ఆ​ప్షన్స్‌ తప్పనిసరిగా ఉండేట్టు చూసుకోవాలన్నారు.మన అందరి ఆగ్రహం ప్రియాంకరెడ్డికి న్యాయం జరగడానికి తోడ్పడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. అదే సమయంలో మహిళలు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

డాక్టర్‌ ప్రియాంకా రెడ్డి దారుణ హత్యతో ఒక కొత్త అంశం తెరమీదకు వచ్చిందని,తెరమీదకు రావడమేకాదు పెద్ద చర్చకు కూడా దారితీస్తోందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇక్కడ మహిళా కమిషన్‌ లేకపోవడం ఆలోచింపజేస్తోందని, మహిళలపై అఘాయిత్యాలు,దారుణాలు జరిగినప్పుడు మహిళా కమిషన్‌ స్పందించాలని, మహిళా కమిషన్‌ చర్యలు తీసుకోవాలని,కానీ ఇక్కడ మహిళా కమిషన్‌ లేకపోవడంతో డాక్టర్‌ ప్రియాంకా రెడ్డికి నిజంగా న్యాయం జరుగుతుందా అనే ప్రశ్న తలెత్తుతోందని,ఇక తెలంగాణలో గత ఆరేళ్లుగా మహిళా కమిషన్‌ లేదని,ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌ కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించకపోవడంపై పలు విమర్శలు వచ్చిన విషయాన్ని పేరం నాగేశ్వరరావు గౌడ్ గుర్తుచేశారు. తొలి విడత ప్రభుత్వంలో మహిళా మంత్రులు లేకుండానే ప్రభుత్వం సాగింది.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకు మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని నాగేశ్వరరావు గౌడ్ ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్‌ సర్కార్‌ రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది. ఇప్పటికీ మహిళా కమిషన్‌ ఏర్పాటు కాలేదు. మహిళలకు ఏదైనా సమస్య వస్తే వాటిని పరిష్కరించేందుకు మహిళా కమిషన్‌ను బాధిత మహిళలు ఆశ్రయిస్తారు. ఒకవేళ ఉన్నప్పటికీ దాన్ని ఆరోవేలు కిందే లెక్కగట్టాల్సి ఉంది. మహిళా కమిషన్‌కు చట్టపరంగా ఉన్న అధికారాలు వేరు. మహిళలకు న్యాయం జరగని పక్షంలో మహిళా కమిషన్‌లు బాధితులకు అండగా నిలుస్తాయి. అంతేకాదు బాధితులకు అన్ని విధాలా సాయం అందేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసే హక్కు కలిగి ఉంటుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంకా రెడ్డి హత్యను జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. రాష్ట్రంలో మహిళా కమిషన్‌ లేకపోవడంతో జాతీయ మహిళా కమిషన్‌ రంగంలోకి దిగిందన్నారు నాగేశ్వరరావు గౌడ్.

మహిళల రక్షణ కోసం షీ టీమ్‌లను ఏర్పాటు చేసినప్పటికీ ఈ టీమ్స్‌ను శివారు ప్రాంతాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. మహిళలు ఆపదలో ఉంటే ఫిర్యాదు చేసేందుకు ఎమర్జెన్సీ నెంబర్లు ఉన్నప్పటికీ… అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందిందనే అభిప్రాయంను పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే నిందితులను పట్టుకుని శిక్ష విధించి ఆతర్వాత బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం దగ్గరుండి చూసుకోవాలని శివ అ నాగేశ్వరరావు గౌడ్ అభిప్రాయపడ్డారు. ఇదంతా కాని పక్షంలో లేదా ప్రభుత్వంలోని ప్రముఖలను సంప్రదించనలేని సమయంలో మహిళా కమిషన్‌ ఉండాలని పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ డిమాండ్‌ చేశారు. మహిళా కమిషన్‌ ఉంటే భరోసా ఉంటుంది కనుక తప్పక న్యాయం జరుగుతుందనే అభిప్రాయం పౌరులు, మహిళలకు ఉంటుందని,ప్రియాంకా రెడ్డి ఉదంతంతోనైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేసి ఒక వ్యక్తిని నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల ఇంచార్జ్ శివ నాగేశ్వర గౌడ్ డిమాండ్ చేశారు.

Leave a Reply