మల్లెపూలు కిలో ధర రూ.3వేలు…

తమిళనాడు రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మల్లెపూల ధరలకు రెక్కలు వచ్చాయి. దేవాలయాలతోపాటు పూజాదికాలు అధికంగా ఉన్న తమిళనాడులోని మధురై నగరంలో మల్లెపూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వారంరోజుల క్రితం మధురై నగరంలో కిలో మల్లెపూల ధర 1500 రూపాయలు పలికింది.

మంగళవారం మధురై నగరంలో మల్లెపూలు కిలో ధర మూడు వేలరూపాయలకు పెరిగింది. తమిళనాడులో కురుస్తున్న భారీవర్షాల వల్ల మల్లెపూల ధర అమాంతం ఆకాశన్నంటిందని శ్రావణ్ కుమార్ అనే పూల వ్యాపారి చెప్పారు. మల్లెపూల ధర కిలో మూడువేలరూపాయలకు చేరినా భక్తులు మాత్రం వాటిని కొనుగోలు చేస్తూనే ఉన్నారు.

Leave a Reply