కాళ్లతో రజినీకాంత్ స్కెచ్ వేసిన అభిమాని

అత‌నికి చేతులు లేవు, కాని కాళ్ళనే చేతుల్లా భావించి అన్ని ప‌నులు చేస్తుంటాడు.

మంచి స్కెచ్‌లు కూడా వేయ‌గ‌ల‌డు. అత‌నెవ‌రో కాదు కేర‌ళ‌కి చెందిన ప్ర‌ణ‌వ్‌. ఇప్ప‌టికే స‌చిన్ టెండూల్క‌ర్‌, కేర‌ళ సీఎంతో పాటు ప‌లువురు స్కెచ్‌ల‌ని అద్భుతంగా వేసి శ‌భాష్ అనిపించుకున్నాడు.

తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ని స్వ‌యంగా క‌లిసి ఆయ‌న‌కి త‌ను వేసిన స్కెచ్‌ని బ‌హుమ‌తిగా వ‌చ్చాడు.

ఇది చూసిన ర‌జ‌నీకాంత్ చాలా సంతోషించి ప్ర‌ణవ్‌తో కాసేపు స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డిపారు.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్‌, ప్ర‌ణ‌వ్ క‌లిసి దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Leave a Reply