సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన పత్తికొండ ఎమ్మెల్యే దేవమ్మ

పత్తికొండ,వార్తాప్రపంచం:
సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను పత్తికొండ వైయస్సార్ పార్టీ కార్యాలయం నందు పత్తికొండ,తుగ్గలి మండలాల బాధితులకు పత్తికొండ ఎమ్మెల్యే దేవమ్మ చెక్కులను అందజేయడం జరిగింది. మామిళ్ల కుంట మూలింటి రాముడు 60,000 వేలు,ఎద్దుల దొడ్డి లక్ష్మీదేవి 20,000 వేలు,చెన్నంపల్లి ఓరుగంటి మహేశ్వర్ రెడ్డి 20,000 వేలు ఎర్రగుడి తండాకు చెందిన రమావత్ వెంకటేష్ నాయక్ 30,000 వేలు రమావత్ లక్ష్మీబాయి 25,000 వేలు, రామలింగయ్య పల్లె సుమలత 35,000 వేలు,జి ఎర్రగుడి గ్రామానికి చెందిన తలారి దేవేంద్ర 60,000 వేలు,తుగ్గలి కి చెందిన చేపల షేక్ మహమ్మద్ 22,000 వేలు,పత్తికొండ మండలం చిన్నహుళ్తి గ్రామానికి చెందిన ఉమా కాంత్ రెడ్డి కుటుంబానికి 2,00,000 లక్షలు,బుగ్గ తండాకు చెందిన రమావత్ బాలమ్మ కి 60,000 వేలు,పత్తికొండ టౌన్ కు చెందిన ఇమ్రాన్ 30,000 వేలు,పందికోన గ్రామానికి చెందిన కమ్మరి వీరయ్య కి 40,000 వేలు,పత్తికొండ టౌన్ కి చెందిన బోగ్గురు హల్తి రెడ్డికి 65,000 వేలు మొత్తం కలిపి 6,67,000 లక్షల అందజేయడంతోబాధితులు ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply