విద్యార్థుల ప్రతిభ అభినందనీయం

చీరాల,వార్తాప్రపంచం:
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల కబ్బడి పోటీలలో కళాశాల విద్యార్థుల ప్రతిభ అభినందనీయం అని వీఆర్ యస్& వై అర్ యన్ కళాశాల కార్యదర్శి ఏ.వేణుగోపాల్
పేర్కొన్నారు.

వేటపాలెం లోని బండ్ల బాపయ్య కళాశాలలో జరిగిన ఆచార్య నాగార్జున విద్యాలయం అంతర్ కళాశాలల కబాడీ పోటీలలో వి.ఆర్.ఎస్ కళాశాల క్రీడాకారులు ద్వితీయ స్థానం సాధించారు . హోరాహోరీగా జరిగిన తుది పోరులో సింగరాయకొండ జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది.ద్వితీయ స్థానం సాధించిన క్రీడాకారులకు కళాశాలలో జరిగిన అభినందన సభలో కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ కబ్బడీ పోటీలలో వీఆర్ఎస్ కళాశాల జట్టు ప్రతి సారి తుది పోరుకు అర్హత సాధిస్తుందని తెలిపారు.తమ కళా శాల క్రీడాకారులు మంచి ప్రతిభ చూపారని అభినందించారు.అదేవిధంగా విశ్వవిద్యాలయం పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు.అఖిలభారత విశ్వవిద్యాలయాల పోటీలలో రాణించి కళాశాలకు పేరు తేవాలని సూచించారు.కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి.సాంబశివరావు,పి.డి సుబ్బారావు,వి.రఘ పాల్గొన్నారు

Leave a Reply