రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల అంశాలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ

ఢిల్లీ,వార్తాప్రపంచం:

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన ఎంపీ నామా నాగేశ్వరరావు,మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు ఎంపీలు,ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గొంగిడి సునీత.. కేంద్ర మంత్రితో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు, మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అందజేసాం..గతంలో తెలంగాణ రాష్ర్టానికి జాతీయ రహదారుల కేటాయింపు అంశంలో అన్యాయం జరిగింది.ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు..3,150కిలో మీటర్ల జాతీయ రహదారులు కేటాయిస్తామని ప్రధాని మోదీ మాట ఇచ్చారు.అందులో 600 కిలో మీటర్లకుపైనా నంబరింగ్ ఇవ్వలేదు..నంబరింగ్ ఇచ్చిన రహదారుల పనులు కూడా ప్రారంభించలేదు..కొత్తవాటికి నంబరింగ్ ఇచ్చి పనులు వేగవంతం చేయాలని కోరినం..వర్షాల వల్ల రాష్ర్టంలోని జాతీయ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.వాటన్నింటిని త్వరగా రిపేర్లు చేయాలని కోరినం..

హైదరాబాద్ నుండి భూపాలపల్లి 163 జాతీయరహదారిలో రెండు చోట్ల అండర్ పాస్ లు మంజూరు చేయాలని కోరినం..కోదాడ-మిర్యాలగూడ జాతీయ రహదారి 167లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా అండర్ పాస్ లు నిర్మాణం చేయాలని కోరినం..చేవేళ్ల-బీజాపూర్ జాతీయరహదారి అంశాన్ని వేగవంతం చేయాలని కోరినం..

హైదరాబాద్ చూట్టు రిజనల్ రింగ్ రోడ్డు అంశాన్ని త్వరగా చేపట్టాలని కోరినం..అన్ని అంశాలపట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు.

Leave a Reply