స్త్రీల పై అత్యాచారాలని నివారించాలి,మహిళల రక్షణ బాధ్యత అందరిదీ: డాక్టర్అమృతపాణి

చీరాల,వార్తాప్రపంచం:

  • స్త్రీ జాతి నశించకుండా రక్షించుకుందాం : చీరాల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ బేబీ రాణి
  • ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిఫెన్స్ ని నేర్చుకోవాలి: సిఐ నాగమల్లేశ్వరరావు
  • చట్టాలను మరింత కఠినం చేయాలి: తాడిలవలస దేవరాజు

డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచార హత్యను ఖండిస్తూ,స్త్రీ జాతిని రక్షించుకోవడానికి డాక్టర్ అమృతపాణి ఆధ్వర్యంలో చీరాలలోని వివిధ కాలేజీల విద్యార్థులతో గడియార స్తంభం సెంటర్ నందు మానవ హారం ఏర్పరిచి,ర్యాలీగా కమ్యూనిటీ హాల్ కు చేరి అక్కడ సభను నిర్వహించడం జరిగింది.

ఈ సభలో ముఖ్య అతిథులుగా ఒకటవ పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు,చీరాల స్పెషల్ ఆఫీసర్ బేబీ రాణి,వివిధ కాలేజీలు మరియు స్కూల్స్ ప్రిన్సిపల్స్,
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మరియు అమ్మ హాస్పిటల్ అధినేత అమృతపాణి పాల్గొన్నారు.

సీఐ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు పోలీసులు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని,మహిళలపై దాడులు పాల్పడితే ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం అని తెలిపారు.ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి తెలిపారు.

లేడీ పోలీసులచే చేయబడి నటువంటి ఆత్మరక్షణ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది.మహిళా పోలీస్ చే నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం మహిళ విద్యార్థులకు ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

డాక్టర్ అమృతపాణి మరియు డాక్టర్ బేబీ రాణి మాట్లాడుతూ తల్లిదండ్రులు మీ పిల్లలను మహిళలను వేధించికుండా చిన్నతనం నుంచే వారిలో నైతిక ప్రవర్తన కలిగేలా తీర్చిదిద్దాలి అని, ఎమర్జెన్సీ నెంబర్ పై అవగాహన కలిగి ఉండాలి అని, కళాశాలలో బాలికలకు ఆత్మరక్షణా విద్యలపై , మహిళలను వేధిస్తే బాలులకు కలిగే నష్టాలను,కష్టాలను, చట్టాలను అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు.

విజ్ఞాన భారతి,నారాయణ కాలేజ్, కస్తూరిబా గర్ల్స్ స్కూల్,ఉమెన్స్ కాలేజ్,శ్రీ మేధా కాలేజ్,చైతన్య కాలేజ్,మదర్ తెరిసా స్కూల్,సాయి కాన్వెంట్,సరస్వతి స్కూల్,వివిధ కాలేజీల విద్యార్థులు మరియు అధ్యాపకులు,అమ్మ రూరల్ డెవలప్మెంట్,డాక్టర్ అమృతపాణి యువసేన మరియు అంబేద్కర్ పూలే సేవాసమితి సభ్యులు కబీర్, మల్లెల బుల్లిబాబు,చిరంజీవి,చిన్ని బాబు, క్రాంతి,పేర్లు నాని,డేవిడ్ ప్రసాద్,శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్,అమ్మ హాస్పిటల్ సిబ్బంది,వన్ టౌన్ పోలీసులు మరియు లేడీ కానిస్టేబుల్స్
పాల్గొన్నారు.

Leave a Reply