నేరస్తులను కఠినంగా శిక్షించి దిశ కు న్యాయం చేయాలి : @ శారదా విద్యా భవన్ హై స్కూల్ విద్యార్థుల కొవ్వొత్తుల ర్యాలీ @

హైదరాబాద్/షాపూర్ నగర్/వార్తాప్రపంచం: దిశ కు న్యాయం చేయాలని,నేరస్తులను కఠినంగా శిక్షించాలని షాపూర్ నగర్ శారదా విద్యా భవన్ హై స్కూల్ విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక కార్యకర్త మధుబాబు చికిలే మాట్లాడుతూ నేరస్తులను కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా మహిళలపై దాడులకు కఠిన చట్టాలు చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎస్ పి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి మాట్లాడుతూ దిశ హత్యకేసు మన సమాజానికి, మన వ్యవస్థకు తీవ్ర అవమానమని, మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని, ఘోరమైన నేరానికి పాల్పడిన నిందితులకు కఠినంగా శిక్షలు అమలు పరచాలని పున్నారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ర్యాలీ అనంతరం జీడిమెట్ల ఇన్స్పెక్టర్ సంతానం కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమ్మలో పాఠశాల కరెస్పాండంట్ సి.భూపాల్ రెడ్డి, ప్రముఖ సామాజిక కార్యకర్త మధుబాబు చికిలే,ఎస్ పి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి,మల్లీశ్వరి,రాఘవేందర్,ప్రభావతి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply