ఐటిఐ కి కట్టర్ బహుకరించిన దేవరాజు.

చీరాల,వార్తాప్రపంచం:

#విద్యార్థులకు అండగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్

మండల పరిధిలోని ఈపూరుపాలెం ఎస్.కె.బి.యన్.యమ్ ఐటిఐ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ యం.డి తాడివలస దేవరాజు కాలేజి ప్రిన్సిపాల్ & ప్రెసిడెంట్ ఎస్.ఏ సత్తార్ కు అందజేశారు.

బుధవారం కాలేజిలో విద్యార్థులతో తాడివలస దేవరాజు మాట్లాడుతూ రానున్న కాలంలో టెక్నికల్ ఫీల్డ్ కు మంచి భవిష్యత్ ఉందని, ఐటిఐ పూర్తి చేసిన విద్యార్థుల కు వెంటనే ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు.కేంద్ర ప్రభుత్వం ఐటిఐ విద్యార్థుల ద్వారా యువతను మరింత ప్రోత్సహించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుపారు.కాలేజి ప్రిన్సిపాల్ ఎస్ఏ సత్తార్ మాట్లాడుతూ దాతల సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగంచేసుకోవాలన్నారు. దాత దేవరాజు చేస్తున్న పలురకాల సేవా కార్యక్రమాలు తమ విద్యార్థులకు స్ఫూర్తిని నింపాయన్నారు.

కార్యక్రమంలో ఎలక్రీకల్ టి.ఓ కాలిషా వలి,రఫీ, రవితేజ,కళ్యాణ్,ప్లేస్మెంట్ ఆఫీసర్ కృష్ణారెడ్డి,ఆఫీస్ ఇంచార్జి జ్యోతి,శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సిబంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply