ఢిల్లీలో ప్రముఖుల మంతనాలు

ఢిల్లీ,వార్తాప్రపంచం: నేడు ఢిల్లీలో అరుదైన కలయిక జరిగింది.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీకి వచ్చిన చలసాని శ్రీనివాసరావు,ఎస్సీ వర్గీకరణ కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి ఢిల్లీకి వచ్చిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చన్నయ్య,ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షులు జాన్ పాల్, బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీకి వచ్చిన బీసీ నాయకులు జై హింద్ గౌడ్,పల్లె ఉపేందర్ గౌడ్, బన్సీలాల్, జర్నలిస్టుల హక్కుల సాధనలో భాగంగా కేంద్ర మంత్రులను ని కలవడానికి ఢిల్లీకి వచ్చిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ జర్నలిస్ట్ నాయకులు బండి సురేంద్రబాబు,రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) జాతీయ సమావేశాలకు విచ్చేసిన ఆర్.పి.ఐ నాయకులు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్ పేరం శివనాగేశ్వరరావు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కృష్ణా జిల్లా రజక సంఘం అధ్యక్షులు దుర్గాప్రసాద్,ఆర్.పి.ఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు మేక వెంకటేశ్వర గౌడ్ ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో సమస్యల పరిష్కారం కోసం చర్చించారు… ఐక్యమత్యంతో అన్ని సమస్యల పరిష్కార దిశగా ఒకరికొకరు సంఘీభావంగా త్వరలో ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు నేతల తెలియజేశారు

Leave a Reply