రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గా శ్రావణ్ ఆయిరేని

ఢిల్లీ,వార్తాప్రపంచం:  రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) నేషనల్ ప్రెసిడెంట్ మరియు కేంద్ర సామాజికన్యాయ శాఖామంత్రి రాందాస్ అథవాలే ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్ పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గా తెలంగాణ ఉద్యమకారుడు శ్రావణ్ ఆయిరేని ను డిల్లీలో నియామకం చేసి నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాకారం అయిందని,అంబేద్కర్ ఆశయ సాధన కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) జాతీయ అధ్యక్షులు ఇచ్చిన అవకాశాన్ని, బాధ్యత ను చిత్తశుద్ధి తో నెరవేరుస్తానని అన్నారు..తనను రాష్ట్ర ఉపాధ్యక్షులు గా నియామకానికి సహకరించిన ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్ పేరం శివనాగేశ్వరరావు గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు శ్రావణ్ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్ పేరం శివనాగేశ్వరరావు గౌడ్,అంజయ్య గౌడ్, సందీప్ కుమార్,మేక వెంకటేశ్వరరావు,కృష్ణా జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply