వైసీపీ దాడులపై అమిత్ షాకు ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏపీ బీజేపీ నేతలు ఈ రోజు కలిశారు. ఏపీలో విపక్షనేతలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అమిత్ షాను కలిసిన వారిలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ నాయుడు, కిలారు దిలీప్ ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై సీఎం జగన్ విమర్శలు చేసిన అంశాన్ని ఆయన దృష్టికి తెచ్చామని, ఈ విషయమై అమిత్ షా సానుకూలంగా స్పందించారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బీజేపీ నేతలు చెప్పారు.

Leave a Reply