సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

కథానాయిక రాశిఖన్నా ప్రస్తుతం ఇంటర్వ్యూలతో బిజీగా వుంది. నిన్నటి వరకు ‘వెంకీమామ’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఈ చిన్నది, ఇప్పుడు వచ్చే వారం రిలీజ్ కానున్న ‘ప్రతి రోజూ పండగే’ చిత్రం ప్రమోషన్ కోసం బిజీ అవుతోంది. పలు టీవీ, ప్రింట్, వెబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా వుంది.

యంగ్ హీరో నితిన్ వివాహం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో జరుగుతుందని తెలుస్తోంది. ఈ వివాహం దుబాయ్ లో వైభవంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా తాను ప్రేమిస్తున్న అమ్మాయిని నితిన్ వివాహం చేసుకుంటున్నాడు.

తమిళ నటుడు అజిత్ హీరోగా వీహెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాలిమై’ చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. యాక్షన్ తో కూడిన పలు చేజింగ్ దృశ్యాలను ఈ షెడ్యూలులో చిత్రీకరిస్తున్నారు.

Leave a Reply