ఆ వైసీపీ నేతలని కూరలో కరివేపాకులా తీసేసిన రాజు గారు…!

వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తప్ప….మిగతా ఏ నాయకుడు మాట వినేది లేదని ఓ వైసీపీ ఎంపీ తెగేసి చెప్పేసారు. అసలు తనకు జగన్ హెడ్ అని మిగతా వారు కాదని, జగన్ కింద ఎవరు ఉన్న వాళ్ళు మాట వినాల్సిన అవసరం తనకు లేదని ఆ ఎంపీ ఘాటుగానే మాట్లాడేశారు. జగన్ తర్వాత పార్టీ లో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లని సైతం కూర లో కరివేపాకులా తీసిపారేసారు. ఈ విధంగా సొంత నేతలనే డోంట్ కేర్ అంటున్న ఆ వైసీపీ ఎంపీ ఎవరో కాదు…కొన్ని రోజులుగా మీడియాలో హల్చల్ చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు.ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న ఈయన… ఎన్నికల సమయంలో వైసీపీలోకి జంప్ చేసి, నరసాపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

అయితే వైసీపీ తరుపున గెలిచిన 22 మంది ఎంపీ లలో 21 మంది ఎంపీలది ఒక రూట్ అయితే… రఘురామకృష్ణం రాజుది ఒక రూట్. ఈయనకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనకు ఏ సమయంలో అయినా వారిని కలిసే కెపాసిటీ ఉంది.అయితే ఎంత కెపాసిటీ ఉన్న పార్టీ లైన్ దాటి వెళ్ళకూడదు. కానీ ఈ రాజు గారు అవేం పట్టించుకోరు…తాను ఏది అనుకుంటే అదే చేస్తారు. ఇలా చేస్తారు కాబట్టే ఇటీవల పార్టీ మారిపోతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని ఖండిస్తూనే….తాజాగా ఢిల్లీ లో ఓ భారీ విందు ఇచ్చారు. దీనికి బీజేపీకి చెందిన అతిరథ మహారథులు చాలామంది హాజరయ్యారు. ఇక ఇదే విషయం పై వైసీపీలో రచ్చ జరుగుతుంది. జగన్ పర్మిషన్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని రాజు గారిని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ప్రశ్నలకు రాజు గారు గట్టి కౌంటర్ ఇచ్చారు.ఇలాంటి వాటికి ఎవరి పర్మిషన్ తీసుకో అవసరంలేదని, జగన్ రాష్ట్ర సమస్యల్లో చాల బిజీగా ఉన్నారని, ఇలాంటివి చెప్పడం అనవసరమన్నారు.

అలాగే తనకు, జగన్ కు గొడవలు పెట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ జగన్ కు తన మీద అనుమానం లేదని చెప్పారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, అయినా తాను జగన్ చెబితేనే వింటానని, ఇంకా ఎవరు చెప్పిన విననని తెగేసి చెప్పేసారు. ఆఖరికి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు చెప్పిన విననని గట్టిగా చెప్పారు. మొత్తానికైతే రాజు గారు… జగన్ తప్ప మిగతా వైసీపీ నేతలని కూరలో కరివేపాకులా తీసేసారు.

Leave a Reply