29న హైదరాబాద్‌కు ఆరెస్సెస్‌ చీఫ్‌

ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఈ నెల 29న హైదరాబాద్‌కు రానున్నారు. తెలుగు రాష్ట్రాల సరస్వతీ విద్యాపీఠం పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం బండ్లగూడలోని శారదాధామంలో జరగనుంది.

సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఏపీ కార్యదర్శి మల్లయ్య, ప్రాంత పూర్వ విద్యార్థి పరిషత్‌ ప్రధాన కార్యదర్శి బీ శ్రీనివాసులు మహా సమ్మేళనం బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

Leave a Reply