హైకోర్టు తరలింపుపై అభ్యంతరం.. విజయనగరం లాయర్ల నిరసన

రాష్ట్రానికి మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉందంటూ ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా… మరి కొందరు తప్పుబడుతున్నారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మారుస్తామని చెప్పడంపై ఉత్తరాంధ్ర లాయర్లు మండిపడుతున్నారు. విజయనగరం జిల్లా లాయర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ ఉదయం విజయనగరంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హైకోర్టును కర్నూలుకు తరలించడం వల్ల ప్రజలు, లాయర్లు ఇబ్బంది పడతారని చెప్పారు. అమరావతిలోనే హైకోర్టును కొనసాగించాలని… లేని పక్షంలో విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply