హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న యాంకర్ ప్రదీప్

తెలుగులో బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్స్ లో ప్రదీప్ ఒకరు. యూత్ లో ప్రదీప్ కి మంచి ఫాలోయింగ్ వుంది. టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతున్న ఆయన, కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కొంతకాలంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్య ఆయన హీరోగా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కొన్ని రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఆ సినిమా ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఆగిపోయిందట. ఈ విషయం ప్రదీప్ కి కొంత నిరాశను కలిగించిందనే చెబుతున్నారు.

ఈసారి ఆయన ఎలాంటి పొరపాటు జరక్కుండా మరో ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడని అంటున్నారు. ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన యువకుడు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. పెద్ద బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Leave a Reply