ఆ క్వారీలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరిక

క్వారీలో మొసలి సంచారం

అటవీ అధికారుల వెతుకులాట

గుంటూరు, రెంటచింతల,వార్తాప్రపంచం:

మండలంలోని గోలి నాపరాయి క్వారీలో మొసలి సంచారం కలకలం రేపింది. సదరు మొసలిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికి సఫలం కాలేదు. దీంతో మాచర్ల ఫారెస్ట్‌ రేంజర్‌ డి.పోతురాజుకు సమాచారం అందించారు. వారంతా రంగప్రవేశం చేసినప్పటికి చీకటిపడడంతో ఫలితం దక్కలేదు. క్వారీ నిండా నీళ్లుండడంతో మొసలి అడపాదడపా పైకి రావడం నీళ్లలోకి పోవడం జరిగింది. సమీపంలోని గోలి వాగు నీళ్లన్నీ ఊట ద్వారా క్వారీలోకి చేరాయి. ఈ సందర్భంగా రేంజర్‌ పోతురాజు మాట్లాడుతూ క్వారీలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. శనివారం ఉదయం ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేస్తామన్నారు. ఆయన వెంట డిప్యూటీ రేంజర్‌ రాజశేఖర్‌గౌడ్‌, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply